భారత దేశంలో 18 సంవత్సరములు నిండిన ప్రతిఒక్కరికి భారత ప్రభుత్వం ఓటు హక్కును కల్పిస్తుంది. 18 సం”రాలు నిండిన యువతీయువకులకు లింగ భేదం లేకుండా ఓటు హక్కును కల్పిస్తుంది. ఈ ఓటు హక్కు కోసం భారత ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ లో ( NVSP.IN ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ( how to register to vote in india ) . భారతదేశంలో నివాసముండే వారు ఫామ్ – 6 ద్వారా కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
how to register to vote in india
ఓటు హక్కు పొందడానికి అర్హతలు :
1. భారతదేశంలో నివాసం ఉండాలి.
2. 18 సం”రాలు నిండి ఉండాలి.
3. ఆధార్ , తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే విధానం.
మొదటిగా ఎన్నికల సంఘం యొక్క వెబ్సైటులో ( NVSP.IN ) లాగిన్ అవ్వాలి. తరువాత మీయొక్క లాగిన్ వివరాలతో వెబ్సైటులో కి లాగిన్ అవ్వాలి.

2. వెబ్సైటు లోకి విజయవంతంగా లాగిన్ అయిన తరువాత వెబ్సైటు ఈ విధంగా ఉంటుంది. భారతదేశంలో నివాసముండే వారు ఫామ్ – 6ను ఉపయోగించి ఓటు హక్కును దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న FORM -6 ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

3. ఇందులో , ముందుగా మీయొక్క STATE ఆప్షన్ లో మీ యొక్క రాష్ట్రము ను ఎంచుకోవాలి. ఆ తరువాత ఉన్న DISTRICT ఆప్షన్ లో మీ జిల్లా ను ఎంచు కోవాలి. ఆ తరువాత ఉన్న ఆప్షన్ లో మీ యొక్క నియోజకవర్గం ను ఎంచుకోవాలి.

ఉదాహరణకు క్రింది విధంగా నమోదు చేసుకోవాలి .
గమనిక : ” * ” ఉంటె ఖచ్చితం గా నమోదు చేయాలి.
అన్ని పూర్తి చేసిన తరువాత ” NEXT ” ఆప్షన్ మీద క్లిక్ చేయడం మరిచిపోవద్దు.

” NEXT ” ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీయొక్క పేరును మరియు మీయొక్క ఇంటి పేరును నమోదు చేయాలి.
ఉదాహరణకు ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు రాపూరు భాస్కర్ అనుకుందాం.
ఇక్కడ FIRST NAME : రాపూరు . అదేవిధంగా SURNAME : భాస్కర్ గా నమోదు చేయాలి.
ఒకవేళ ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు భాస్కర్ రాపూరు అనుకుందాం.
అప్పుడు FIRST NAME : భాస్కర్ . అదేవిధంగా SURNAME : రాపూరు గా నమోదు చేయాలి

ఇంగ్లీష్ లో పేరు నమోదు చేయగానే అది తెలుగు లోకి మన పేరు మారుతుంది. అలా తెలుగు లోకి మారినప్పుడు కొన్ని సందర్భాలలో తెలుగు పేర్లు తప్పుగా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో ఇక్కడ కనిపిస్తున్న కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే తెలుగు కీబోర్డ్ వస్తుంది. దాని సహాయంతో మీ పేరును తెలుగు లో తప్పు లేకుండా సరిచేయవచ్చు.

ఇక్కడ ఉన్న CHOOSE FILE ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్ ఫోటో ను అప్లోడ్ చేయాలి. దీని యొక్క సైజు కనీసం 2MB కంటే తక్కువగా ఉండే విధంగా చూడాలి. పాస్ ఫోటో లో ముఖం సరిగ్గా కనిపించే విధంగా ఉండాలి.

ఫోటోను విజయవంతంగా అప్లోడ్ చేసిన తరువాత “NEXT “ఆప్షన్ మీద క్లిక్ చేయండి
ఇక్కడ మనకు కావలసిన Relative ఆప్షన్ ని ఎంచుకొని వారి యొక్క వివరాలు నమోదు చేయాలి.
ఇక్కడ రిలేటివ్ యొక్క తెలుగు పేరు తప్పుగా వచ్చింది . . దానిని సరి చేయడానికి ఇక్కడ ఉన్న కీబోర్డ్ మీద క్లిక్ చేయండి , దానిని క్లిక్ చేయడం ద్వారా మనము తెలుగు కీబోర్డ్ ని పొందుతాము .

మనము ఈ తెలుగు కీబోర్డ్ సహాయంతో తప్పుగా వచ్చిన రిలేటివ్ నేని సహాయంతో సరి చేసుకోవచ్చు

పేరుని విజయవంతంగా సవరించిన తర్వాత “NEXT“ ఆప్షన్ మీద క్లిక్ చేయడం మరిచిపోవద్దు .
ఫోన్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ మీద లేక మీ బంధువులదా అనే ఆప్షన్ ని మొదటగా సెలెక్ట్ చేసుకోవాలి . ఆ తరువాత బాక్స్ లో ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి .
ఒకవేళ మీరు మీ ఇమెయిల్ ఐడి ని కూడా నమోదు చేసుకోవాలి అనుకుంటే ఆ ఇమెయిల్ మీద లేక మీ బంధువులద అని సెలెక్ట్ చేసుకుని కింది బాక్సులు మెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి . మీరు విజయవంతంగా నమోదు చేసిన తరువాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయటం మరిచిపోకండి .

మీకు ఆధార్ కార్డు ఉంటే మొదటి ఆప్షన్ ని ఎంచుకొని కింద బాక్స్ లో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి . ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి .

GENDER అనగా లింగం . ఇక్కడ మీరు మగవారు అయితే MALE ఆప్షన్ ని ఎంచుకోవాలి . మీరు ఆడవారు అయితే FEMALE ఆప్షన్ ని ఎంచుకోవాలి . తరువాత “NEXT“ ఆప్షన్ మీద క్లిక్ చేయండి .

ఇక్కడ మీ యొక్క శాశ్వత ఇంటి చిరునామాను నమోదు చేయాలి . అనగా మీయొక్క ఇంటి నంబరు గ్రామం మండలం జిల్లా మరియు రాష్ట్రం యొక్క పేరును నమోదు చేయాలి . ఆధార్ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ప్రకారం ఇంటి చిరునామాను నమోదు చేసుకోవాలి .

ఇంటి చిరునామాకు జతపరవలసిన పత్రాలు:
ఇంటి చిరునామా కి కావలసిన పత్రాలు కింద ఇవ్వబడిన ఫోటోలు ఇవ్వడం జరిగింది .

నేను నా అడ్రస్ ప్రూఫ్ కి ఆధార్ కార్డ్ ని ఎంచుకున్నాను కావున నేను నా యొక్క ఆధార్ కార్డు ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా మీరు మీ అడ్రస్ కి దేనినైతే సెలెక్ట్ చేసుకుంటారో దానిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది .
మీరు అప్లోడ్ చేసే ఫైలు 2MB కంటే ఎక్కువ మించి ఉండరాదు .

ఇక్కడ మీరు వికలాంగురాలు లేదా వికలాంగుడు అయితే అందుకు సంబంధించిన వివరాలు నమోదు చేసి తగిన పత్రాలను అప్లోడ్ చేయాలి .

ఈ డిక్లరేషన్ లో మీ యొక్క గ్రామం పేరు, రాష్ట్రం పేరు , జిల్లా పేరు నమోదు చేసిన తర్వాత మీరు ఆ గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నివసిస్తున్నారో నమోదు చేయాలి .

PLACE ఉన్న దగ్గర బాక్స్ లో మీ యొక్క గ్రామం పేరు లేదా మండలం పేరు నమోదు చేయండి . తరువాత CAPTCHA నమోదు చేసిన తరువాత SEND OTP మీద క్లిక్ చేయగానే మీరు చేసిన ఫోన్ నెంబర్ కి ఒక OTP వస్తుంది . వచ్చిన OTP ని తరువాత ఉన్న బాక్స్ లో నమోదు చేయాలి . చివరిగా దరఖాస్తులు ఒకసారి పూర్తిగా తనిఖీ చేసుకున్న తర్వాత PREVIEW AND SUBMIT మీద క్లిక్ చేయండి . మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది దానిని జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి దాని సహాయంతో మన దరఖాస్తు ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోవచ్చు .

ఈ దరఖాస్తు ఫారం ను మనకు కొన్ని సెక్షన్ల వారీగా ఇవ్వడం జరిగింది . ఒక సెక్షన్ లోని అన్ని వివరాలు నమోదు చేస్తేనే NEXT ఆప్షన్ పనిచేస్తుంది . దరఖాస్తు సమయంలో తెలుగు అలాగే ఇంగ్లీష్ అక్షరాలను తరచు తనిఖీ చేసుకోవాలి . అదేవిధంగా మనం అప్లోడ్ చేసే ఏ ఫైల్ అయినా కూడా 2MB కంటే మించి ఉండరాదు . దరఖాస్తు పూర్తి అయిన తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, దానిని జాగ్రత్తగా భద్రపరచాలి. దాని సహాయంతో మన అప్లికేషన్ ఎంతవరకు పూర్తి అయినది అనే విషయాన్ని మనం ఆ నంబర్ సహాయంతో తెలుసుకోవచ్చు .
Leave a Reply